తాండూరు టౌన్: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) తాండూరు డివిజన్ అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ గౌడ్ (అక్షర స్కూల్) నియమితులయ్యారు. బుధవారం పట్టణంలో ట్రస్మా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలిగా కీర్తి శర్మ, అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడిగా వహీద్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్, సంయుక్త కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా ఎం రమేష్ గౌడ్, సలహా కమిటీ సభ్యులుగా ఇందూర్ రాములు, సోహెల్ ఉమ్రిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తాండూరు పరిధిలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షిస్తానని, సంఘం ఐక్య తను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
మద్యం మత్తులో ఎస్‌ఐపై దాడి
బంజారాహిల్స్: నో పార్కింగ్‌లో ఉన్న వాహనాన్ని తొలగించాలని చెప్పిన ట్రాఫిక్ ఎస్‌ఐపై మద్యం మత్తులో ఉన్న యువకుడు దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్‌ఐ షేక్‌సలాం ఈ నెల 21న బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని వైన్‌షాపు సమీపంలో నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన వాహనాలను తొలగింపు చేపట్టారు. ఓ ౖబైక్‌ను అక్కడి నుంచి తరలించాలని సయ్యద్‌నగర్ నివాసి సయ్యద్ జాకర్‌కు సూచించారు. అయితే వాహనాన్ని తొలగించకుండా ఎస్‌ఐను దుర్బాషలాడడంతో పాటు తోసివేసి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో షేక్‌సలాం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా జాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


