నాయకుల ముందస్తు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నాయకుల ముందస్తు అరెస్ట్‌

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మండలంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కొంత మందిని అరెస్టు చేయగా మరి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. వీరిలో ఎంఐఎం తాలూకా అధ్యక్షుడు ఎస్‌బీ గుల్షన్‌, సీపీఐ నాయకులు ఇందనూర్‌ బషీర్‌, మైమూద్‌, శ్యాంసుందర్‌, సురేష్‌గౌడ్‌, మూతుల రాజు, శ్రీనివాస్‌, మల్లప్ప, రహీం, వెంకటప్ప, బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ మధుయాదవ్‌ ఉన్నారు. దుద్యాల్‌ మండలం లగచర్ల గ్రామానికి చెందిన బొగమోని సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత వీరందరినీ వదిలి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement