కూతురు చావుకు అల్లుడే కారణం! | - | Sakshi
Sakshi News home page

కూతురు చావుకు అల్లుడే కారణం!

Jul 8 2026 9:38 AM | Updated on Jul 8 2026 9:38 AM

అక్రమంగా వైన్‌ తయారీ రేషన్‌ బియ్యం పట్టివేత

బంట్వారం: కూతురు చావుకు అల్లుడే కారణమని మృతురాలి తల్లి షేక్‌ ఫాతిమా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విమల తెలిపిన వివరాలి ఉన్నాయి.. హైదరాబాద్‌ బోరబండకు చెందిన సలీమాను తొర్మామిడికి చెందిన వాజెర్‌ సోహెల్‌ నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 6న రాత్రి 10.30 గంటలకు సలీమా.. తల్లికి ఫోన్‌ చేసి రేపు బోరబండకు వస్తున్నాని చెప్పింది. కానీ ఈ నెల 7న ఉదయం తెల్లవారు జామున 4 గంటలకు సలీమా(26) మృతి చెందినట్లు మామ వజ్ర సలీం.. మృతురాలి తల్లికి ఫోన్‌ చేశాడు. దీంతో తన కూతురు మృతికి అల్లుడు సోహెల్‌ కారణమని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు.

సివిల్‌ తగాదాల్లో

పోలీసుల జోక్యం తగదు

బాధిత రైతు కొత్తకాపు రంగారెడ్డి

ధారూరు: సివిల్‌ తగాదాల్లో జోక్యం చేసుకుంటున్న ధారూరు పోలీసులు అమాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మోమిన్‌ఖుర్దుకు చెందిన కొత్తకాపు రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 90లో తనకు వారసత్వంగా ఐదెకరాల పొలం వచ్చిందన్నారు. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్‌ గోడ నిర్మించి, గేటు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇదే ఊరికి చెందిన పట్లోళ్ల రాజేందర్‌రెడ్డి తమ పొలంలోకి వచ్చి దౌర్జన్యంగా పెంటకుప్ప వేశారన్నారు. ఈ విషయమై ఇరవై రోజుల క్రితం తాను పోలీసులకు లిఖిత పూర్వకరంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇదే విషయమై రాజేందర్‌రెడ్డి స్థానిక ఎస్‌ఐ రాఘవేందర్‌కు ఫోన్‌ చేయడంతో చర్యలు తీసుకోవాల్సిందిపోయి తమపై మండిపడ్డారన్నారు. వానాకాలం సాగు కోసం తాము పొలం దున్నుతుండగా రాజేందర్‌రెడ్డికి సంబంధించిన వ్యక్తి పి.శశాంక్‌రెడ్డి వచ్చి, ఈపొలం తమదని, దున్నితే అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఎస్‌ఐ రాఘవేందర్‌ను వివరణ కోరగా.. అది సివిల్‌ తగాదా అని తమకు సంబంధం లేదని చెప్పామన్నారు. రంగారెడ్డిని బెదిరించలేదని, రాజేందర్‌రెడ్డితో సర్దుకుపోవాలని సూచించామని స్పష్టంచేశారు.

గుట్టురట్టు చేసిన డిస్టిలరీ టాస్క్‌ఫోర్స్‌.. ముగ్గురి అరెస్ట్‌

చిలకలగూడ: అనుమతుల్లేకుండా అక్రమంగా వైన్‌ తయారీ చేస్తున్న కేంద్రాలపై డిస్టిలరీటాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు చేశాయి. సికింద్రాబాద్‌ డిస్టిలరీ టాస్క్‌ఫోర్స్‌(డీటీఎఫ్‌) సీఐ సౌజన్య కథనం ప్రకారం.. మెట్టుగూడ, తార్నాక ప్రాంతాల్లో పలువురు ఆంగ్లో ఇండియన్లు అక్రమంగా వైన్‌ తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు డీటీఎఫ్‌ బృందాలు మంగళవారం దాడులు నిర్వహించాయి. మెట్టుగూడలోని ఓ ఇంట్లో వైన్‌ తయారు చేస్తున్న ఆంటోనిని అదుపులోకి తీసుకుని, 25 వైన్‌ బ్యాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి ప్రాంతంలో వైన్‌ తయారీ కేంద్రంపైనా దాడి చేసి వేణు, ప్రకాశ్‌ అనే నిందితులను అరెస్ట్‌ చేసి, 20 లీటర్ల వైన్‌ పట్టుకున్నారు. సుమారు రూ.50 వేల విలువ చేసే వైన్‌తోపాటు నిందితులు ఆంటోనీ, వేణు, ప్రకాశ్‌లను సికింద్రాబాద్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.

శంకర్‌పల్లి: పేదల వద్ద తక్కువ ధరకి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం శంకర్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ ముదాసిర్‌ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన లౌడ్యా నాయక్‌(45) కొన్నేళ్లుగా అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్నాడు. ఇటీవల శంకర్‌పల్లి మండలం రావులపల్లి కలాన్‌ గ్రామంలో పేదల వద్ద తక్కువ ధరకి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేశాడు. దీన్ని మొయినాబాద్‌ మండలం చిన్న మంగళారం గ్రామంలో ఉండే మహబూబ్‌కి అమ్మేందుకు జీపులో బియ్యాన్ని సిద్ధం చేశాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం జీపుపై దాడులు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 250 కిలోల రేషన్‌ బియ్యం, జీపును స్వాధీనం చేసుకున్నారు. లౌడ్యానాయక్‌, మహబూబ్‌లపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం లౌడ్యా నాయక్‌ పోలీసుల అదుపులో ఉండగా.. మహబూబ్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement