మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డికి నోటీసులు
ఇబ్రహీంపట్నం: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన తన యుడు మంచిరెడ్డి ప్ర శాంత్‌కుమార్‌రెడ్డికి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆకుల యా దగిరిని బలవంతగా అపహరించి, నిర్బంధించారనే ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిషన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి అందుబాటులో లేనికారణంగా ఎల్మినేడులోని వారింటి గోడలకు నోటీసులు అంటించారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, నిబంధనలు పాటించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.


