అంతర్జాతీయ సదస్సుకు హాజరు
షాద్‌నగర్: ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ శయుక్షక్ ఫౌండేషన్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సంయుక్తంగా అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తోంది. ఈ సెమినార్‌లో ఆదివారం షాద్‌నగర్ పట్టణానికి అర్ధశాస్త్ర అధ్యాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. సదస్సుకు కేంద్ర కామర్స్ ఇండస్ట్రీ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి జితిన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా క్రిటికల్ ‘ఎవాల్యూషన్ ఆఫ్ ది టీచర్ రోల్ ఇన్ ది డిజిటల్ ఎరా ఇన్ ఇండియా’ పేరుతో రూపొందించిన పరిశోధన పత్రాన్ని సెమినార్‌లో డాక్టర్ రవీందర్‌రెడ్డి సమర్పించారు.
కొత్తూరు: మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ జెడ్పీహెచ్‌ఎస్‌లో పీడీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీలత జాతీయస్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలకు రెఫరీగా ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి మార్చి 1వ తేదీ వరకు పశ్చిమబెంగాల్‌లో నిర్వహించే పోటీలకు ఆమె రెఫరీగా వ్యవహరించనున్నారు.


