వాట్సాప్ చాట్‌బాట్‌లో విద్యుత్ సేవలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వినియోగదారులకు మరింత సమర్థ, సులభకర సేవలు అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాల్ సెంటర్లలో ఏఐ వాయిస్ బాట్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా వాట్సాప్ చాట్‌బాట్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్‌కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా.. ఇకపై మొబైల్ ఫోన్ ద్వారానే ఈ సేవలను సులభంగా పొందొచ్చు. వినియోగదారులు వాట్సాప్‌లో 87124 41912 నంబర్‌ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపిస్తే చాలు. విద్యుత్ కోతలు, బిల్లుల జారీలో ఆలస్యం, అధిక బిల్లులు, మీటర్లలో సాంకేతిక సమస్యలు, ఫిర్యాదు ఏ దశలో ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉంది? తదితర సమాచారం స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యుత్‌కు సంబంధించిన సమాచారాన్ని వేగంగా పొందొచ్చు. అంతేకాదు.. ‘మీ బిల్లు పెండింగ్ ఉంది, బిల్లు కట్టకుంటే ఈ రాత్రి కరెంట్ కట్ చేస్తాం. అర్జంటుగా ఈ నంబర్‌కు కాల్ చేయండి’ వంటి మెసేజ్‌లు పంపి అమాయకులను దోచుకునే సైబర్ నేరగాళ్ల ఆటలు సాగవు. బిల్‌పై అనుమానం ఉంటే వెంటనే ఈ సదుపాయం ద్వారా సమాచారం పొంది అప్‌డేట్ కావొచ్చు. మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహ రించవచ్చు’ అని ఆ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సూచించారు.
● అందుబాటులోకి 87124 41912 నంబర్
● ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, బిల్ రిలేటెడ్ సమాచారం
వాట్సాప్ చాట్‌బాట్‌లో విద్యుత్ సేవలు


