10.61 కిలోల గంజాయి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

10.61 కిలోల గంజాయి సీజ్‌

Feb 21 2026 8:56 AM | Updated on Feb 21 2026 8:56 AM

10.61

10.61 కిలోల గంజాయి సీజ్‌

బాలిక అదృశ్యం

కందుకూరు: అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులు నుంచి పోలీసు లు 10.61 కిలో ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ సీతారామ్‌ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మండలంలోని నేదునూరు గేట్‌ వద్ద ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన మలిశెట్టి దుర్గామల్లికార్జునరాజు (25), విశాఖపట్నం జిల్లా మాడ్గుల మండలం మరియు గ్రామానికి చెందిన రమావత్‌ మోద మహేశ్‌ (19) నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తున్నారు. వారి నుంచి 10.61 కిలోల గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి సరఫరా చేసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ పరమేశ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రెండు ఆలయాల్లో హుండీ చోరీ

షాద్‌నగర్‌రూరల్‌: ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండల పరిధిలోని కడియాలకుంట తండాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాలోని సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయం, బూరుగడ్డ తండాలోని ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలను దుండగులు ఎత్తుకెళ్లారు. కానుకలను అపహరించి హుండీలను సమీప పొలాల్లో పడేశారు. ఈ మేరకు సర్పంచ్‌ రాజునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్‌ ఎస్‌ఐ శివారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

శంషాబాద్‌ రూరల్‌: కు టుంబ సభ్యులు జాతరకు వెళ్లగా.. ఇంటి నుంచి బాలిక అదృశ్యమైన ఘటన రషీద్‌గూడలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... వనపర్తి జిల్లా వీపనగండ్ల నివాసి ఆలె ఆశన్న తన కుటుంబంతో కలిసి నాలుగేళ్ల కిందట వలస వచ్చి రషీద్‌గూడలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 19న భార్య, కొడుకుతో కలిసి ఆశన్న కొల్లాపూర్‌లోని ఈదమ్మ జాతరకు వెళ్లారు. ఈ సమయంలో వారి కూతురు సింధు ఇంట్లోనే ఉంది. ఈమె పట్టణంలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్‌ చదువుకుంటుంది. కుటుంబ సభ్యులు జాతర నుంచి అదే రోజు ఇంటికి వచ్చి చూడగా.. సింధు ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో నుంచి దుస్తులు, స్టడీ సరిఫికెట్లు కూడా లేవు. ఆమె కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పొలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10.61 కిలోల గంజాయి సీజ్‌ 
1
1/1

10.61 కిలోల గంజాయి సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement