నిబంధనలు పాటించకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించకుంటే చర్యలు

Feb 21 2026 8:56 AM | Updated on Feb 21 2026 8:56 AM

నిబంధనలు పాటించకుంటే చర్యలు

నిబంధనలు పాటించకుంటే చర్యలు

మీర్‌పేట: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఫిర్యాదు మేరకు శుక్రవారం బడంగ్‌పేట సర్కిల్‌ ప్రశాంతిహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని నందిహిల్స్‌, టీచర్స్‌కాలనీల్లోని మటన్‌, చికెన్‌ షాపులను వెటర్నరీ అధికారి డాక్టర్‌ రవిచంద్ర ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సైదులు మటన్‌, చికెన్‌ సెంటర్‌లో కుళ్లిపోయిన మటన్‌ను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించడంతో పాటు లైసెన్సు లేకపోవడంతో షాప్‌ను సీజ్‌ చేశారు. దీంతో పాటు మరో నాలుగు చికెన్‌ సెంటర్లకు లైసెన్సులు లేకపోవడం, నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్నందున జరిమానాలు విధించారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ చంటి ముదిరాజ్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా నిబంధనలు పాటించకుంటే ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీల్లో కమిటీ రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల మల్లేశ్‌, అరుణ్‌సింగ్‌, దుశ్యంత్‌ బల్బీర్‌సింగ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement