ఆలయాల అభివృద్ధికి సహకారం | - | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి సహకారం

Feb 21 2026 8:56 AM | Updated on Feb 21 2026 8:56 AM

ఆలయాల అభివృద్ధికి సహకారం

ఆలయాల అభివృద్ధికి సహకారం

బోడుప్పల్‌: మన సంస్కృతి సంప్రదాయాలకు ఆలయాలు ప్రతీకలుగా నిలుస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బోడుప్పల్‌ కేశవనగర్‌ కాలనీలోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్‌ ఆలయంలో శుక్రవారం పంచముఖ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పూజలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని, యువత ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేష్‌, కోశాధికారి నారాయణరావు, కేశవనగర్‌ కాలనీ అధ్యక్షులు బసవారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కాలనీవాసులు పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement