మతసామరస్య పరిమళం
కొత్తూరు: పెంజర్లలో స్వయంభువుగా వెలిసిన శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. సుమారు 800 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఆలయాన్ని దాతల సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. కొత్తూ రు జాతీయ రహదారి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోలు, జీపులు అందుబాటులో ఉన్నాయి. ఇన్ముల్‌నర్వలో వెలిసిన జహంగీర్ పీర్ దర్గా రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచింది. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.


