గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు

Aug 25 2025 9:15 AM | Updated on Aug 25 2025 9:15 AM

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు

బంట్వారం: గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని మర్పల్లి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శాఖం నర్సింలు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని బస్వాపూర్‌కు మంజూరైన మినీ లైబ్రరీ ఏర్పాటుకు గ్రామస్తులతో కలిసి పాఠశాలలోని రెండు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్వాపూర్‌కు మంజూరైన మినీ లైబ్రరీని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ లైబ్రరీలో దిన పత్రికలు, కాంపిటేటివ్‌ పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, మర్పల్లి ఏఎంసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, కృష్ణ, ఆనందం, రాజు, విద్యాకమిటీ మాజీ చైర్మన్‌ శివరాజ్‌ పాల్గొన్నారు.

ఏఎంసీ డైరెక్టర్‌ మహేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement