చంద్రగిరి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రామచంద్రాపురం, చంద్రగిరి మండలాలకు చెందిన పలువురు నాయకులు, యువకులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తుమ్మలగుంటలోని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ ఐఏవై కాలనీకి చెందిన కొణిదెల సురేష్‌తో పాటు ఎన్‌.కె.నితిన్‌, ఎన్‌.మణికంఠ, ఏ.మద, కె.విష్ణు, కె.శివ, బన్నీ పార్టీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ వలంటరీ విభాగం అధ్యక్షుడు లోకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వీరు చెవిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే చంద్రగిరి మండలం, బుచ్చినాయుడుపల్లిలో అమ్మగుంట గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో కమల్‌ సాయి, విష్ణు, ప్రకాష్‌, రుత్విక్‌ వైఎస్సార్‌ సీపీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి సమక్షంలో వీరు పార్టీ కండువాలు కప్పుకున్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారిని మోహిత్‌ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement