బాల్యం బడిలోనే.. పెళ్లి పీటలపై కాదు | - | Sakshi
Sakshi News home page

బాల్యం బడిలోనే.. పెళ్లి పీటలపై కాదు

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

తిరుపతి అర్బన్‌: బాల్యం బడిలోనే గడపాలని...పెళ్లి పీటలపై కాదని ఐసీడీఎస్‌ పీడీ వసంతబాయి తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో ప్రగతి సంస్థ, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, మత పెద్దలను సమన్వయం చేసుకుని అందరి భాగస్వామ్యంతో సమావేశాన్ని చేపట్టారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహ ముక్త భారత్‌ ప్రచారంలో భాగంగా శుక్రవారం బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి శివశంకర్‌, జెడ్పీ డిప్యూటీ సీఈవో రమణప్రసాద్‌, డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్‌, ముఖ్యప్రణాళిక అధికారి రాజశేఖర్‌, ప్రగతి సంస్థ డైరెక్టర్‌ కేవీ రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement