కూటమిది గెలుపు కాదు ..బలుపు | - | Sakshi
Sakshi News home page

కూటమిది గెలుపు కాదు ..బలుపు

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

● వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి

తిరుపతి మంగళం:స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిది గెలుపు కాదని, వారి బలుపు చూపించుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో రెడ్‌బుక్‌పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ప్రభుత్వం జరిపిన విధానం చూస్తుంటే ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేసి అబాసపాలు చేసినట్లుగా కనిపిస్తోంద న్నారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికల రోజు వరకు టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు అన్నీ ఇన్ని కావన్నారు. తిరుపతి జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎక్కడా నామినేషన్లు వేయనీయకుండా విచ్చక్షణరహింతగా కొట్టారన్నారు. ఎన్నికల రోజున పక్క రాష్ట్రాల నుంచి హంతకులను పిలిపించుకుని దొంగ ఓట్లను వేసుకున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చి న వారికి వేరొక వారి స్లిప్పులతో పాటు అక్కడికక్కడే ఆధార్‌ కార్డులను సైతం ప్రింట్‌లు తీయించి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. తిరుపతి జిల్లాలో మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలే కూటమి అరాచకాలు, దౌర్జన్యాలకు నిదర్శనమన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement