ముగిసిన నామినేషన్ల ఘట్టం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల ఘట్టం

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

● నేడు పరిశీలన, 21తో ముగియనున్న ఉపసంహరణ ● ప్రచార బరిలోకి దిగిన అభ్యర్థులు

సాక్షి, తిరుపతి : మున్సిపల్‌ పోరులో కీలకఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జిల్లాలోని తిరుపతి కార్పొరేషన్‌తోపాటు వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, పుత్తూరు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో సోమవారం అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.పురపోరులో నామినేషన్ల తిరస్కరిస్తే అభ్యర్థులు అప్పీలు చేసే అవకాశం లేదు. ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఆ తర్వాత అదే రోజు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రచురించనున్నారు. వాటి ఆధారంగా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ చేపట్టనున్నారు. ఏకగ్రీవమైన మున్సిపల్‌ చైర్మన్‌, వార్డు సభ్యుల వివరాలను సైతం బుధవారమే ప్రకటించనున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు పోటీలో ఉన్న చోట పోలింగ్‌ జరగనుంది. అవసరమైన చోట ఈ నెల 29వ తేదీన రీపోలింగ్‌ నిర్వహిస్తారు. మున్సిపల్‌ ఎన్నికల ఓట్లను ఈనెల 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఓటరు దేవుళ్లను ప్రసన్న చేసుకునే పనిలో పడ్డారు. ప్రచారానికి తక్కువ సమయంలో ఉండడంతో వీలైనంత త్వరగా ఎక్కవమందిని కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసకుంటున్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులలేమి, అధిక ధరలను తమ ప్రచార అస్త్రాలుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలోనే టీడీపీ నేతలు బరితెగించి నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రజాస్వామిక పోకడలకు ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధిచెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తిరుపతిలో పచ్చమూక ఆగడాలు

తిరుపతి కార్పొరేషన్‌ పరిఽధిలో తొలి రెండు రోజులు సాగిన పచ్చమూకల ఆగడాలు చివరి రోజు కూడా కొనసాగాయి. వైఎస్సార్‌సీపీ, సీపీఎం పార్టీల అభ్యర్థులను నామినేషన్‌ దాఖలు చేయనీకుండా టీడీపీ మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు చెందిన రౌడీమూకలు అడ్డుకున్నాయి. అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశాయి. అధ్యాత్మిక నగరంలో ఇంతటి అరాచకం సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోగా అధికారపార్టీ నేతలకు వంతపాడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మేయర్‌/చైర్మన్‌ స్థానానికి నామినేషన్లు

మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ టీడీపీ జనసేన ఇతరులు

తిరుపతి 02 06 0 28

సూళ్లూరుపేట 05 02 0 03

వెంకటగిరి 03 03 0 03

నాయుడుపేట 05 03 0 06

పుత్తూరు 07 01 02 01

వార్డులకు దాఖలైన మొత్తం నామినేషన్లు

మున్సిపాలిటీ మొత్తం వార్డులు వైఎస్సార్‌సీపీ టీడీపీ జనసేన బీజేపీ ఇతరులు

తిరుపతి 66 87 172 67 15 108

సూళ్లూరుపేట 32 66 65 03 07 21

వెంకటగిరి 36 91 103 05 04 13

నాయుడుపేట 32 81 59 03 10 17

పుత్తూరు 36 117 123 05 04 14

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement