పుత్తూరులో రెడ్‌బుక్‌ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

పుత్తూరులో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

పుత్తూరు: పుత్తూరులో లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందనేందుకు ఆదివారం పట్టణంలోని నామినేషన్‌ కేంద్రం వద్ద జరిగిన ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్‌ వేయడానికి వచ్చిన మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డి.జయప్రకాష్‌ పత్రాలను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ కారు డ్రైవర్‌ ఉదయ్‌ లాక్కొని చించివేశాడు. అనంతరం సదరు ఘనుడు గోడ దూకి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్కడే ఉన్న మరో పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకుని విడిచిపెట్టమని ఆదేశించడంతో సిబ్బంది వదిలేశారు. దీనిపై మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యరిర్థ డి.జయప్రకాష్‌ మాట్లాడుతూ నామినేషన్‌ పత్రాలను చించివేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ కారు డ్రైవర్‌ ఉదయ్‌ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మీడియాను సైతం నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతించని పోలీసులు వడమాలపేట మండలానికి చెందిన ఉదయ్‌ అనే వ్యక్తిని ఎలా పంపించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న మరో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించినట్టు తెలిపారు. అయితే డ్రైవర్‌ ఉదయ్‌ నిర్వాకంపై ప్రశ్నించగా డీఎస్పీ రవికుమార్‌ మాట దాట వేసి వెళ్లిపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement