అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

తిరుపతి మంగళం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేసుకుని టీడీపీ గూండాలు ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారని పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవకోనలోని 66వ వార్డులో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి వడ్డెర రమణపై టీడీపీ రౌడీలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నామినేషన్‌ పత్రాలను చించివేశారు. ఈ క్రమంలో వడ్డెర రమణ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డిని కలిశారు. భూమన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాబోయేది మన ప్రభుత్వమే అని, ఇప్పుడు దుర్మార్గాలకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెబుదామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement