గ్రామం ఒక్కటే.. నియోజకవర్గాలు రెండు | - | Sakshi
Sakshi News home page

గ్రామం ఒక్కటే.. నియోజకవర్గాలు రెండు

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

ఆ గ్రామం ఒక్కటే... కానీ ఆ గ్రామానికి చెందిన ప్రజలు రెండు మండలాలు, రెండు నియోజకవర్గాలకు చెందినవారు. ఆ పల్లె పేరు కుక్కలదొడ్డి.. రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీ పరిధిలో ఉంది. గ్రామంలో మొత్తం 257 ఇళ్లు ఉండగా, వాటిలో 64 ఇళ్లు రేణిగుంట మండలం మామండూరు పంచాయతీ పరిధిలోకి రాగా, తక్కిన 189 కుటుంబాలు రైల్వే కోడూరు మండలం, బాలుపల్లి పంచాయతీ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామంలో ఒక ఇల్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఉంటే, ఆ ఇంటికి ఆనుకుని ఉన్న మరో ఇల్లు రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుండడం విశేషం. ఈ గ్రామానికి చెందిన 174 ఓటర్లు మామండూరు పంచాయతీ పరిధిలో ఉండగా, ఈ పంచాయతీలో మొత్తం 993 మంది ఓటర్లున్నారు.

– ఏర్పేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement