కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

● పార్టీ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కార్యకర్తా జగనన్న గుండెల్లో ఉంటారు ● విస్తృత స్థాయి సమావేశంలో భూమన

నాగలాపురం: జగన్‌ 2.0లో కార్యకర్తలకే అధిక ప్రా ధాన్యత ఉంటుందని, గుర్తింపు కార్డు కలిగిన ప్రతి కార్యకర్త జగనన్న గుండెల్లో స్థానం లభిస్తుందని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శనివారం నాగలాపురం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజే ష్‌ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భూమన హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ నియోజకవర్గంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పదవులు పొందిన వారికి వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో భూమన మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మళ్లీ సీఎంగా చేసుకోవడానికి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి అభ్యర్థికి పార్టీ తరఫు న మద్దతు ఉంటుందన్నారు. గతంలో అధికారం కో ల్పోయిన చంద్రబాబు ప్రజల్లోకి రావడానికి మూడేళ్ల సమయం పట్టిందని, ఇదే వైఎస్సార్‌సీపీ మాత్రం అధికారం కోల్పోయిన మూడు రోజుల్లోనే తిరిగి ప్రజల పక్షాన నిలబడి చంద్రబాబు ప్రభుత్వం ఆగడాలను నిలదీయడంలో ముందుందని తెలిపారు. సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

సమన్వయంతో పని చేయాలి

వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి ఎంత బలవంతుడైనా వారిని ఎదుర్కొనేందుకు ఐక్యంగా సమన్వయంతో ముందుకు సాగితే గెలుపు సాధ్యమేనన్నారు. చిన్నపాటి సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించుకుని నియోజకవర్గంలో పార్టీకి గట్టి పునాదులు వేసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలిచే ప్రతి కార్యకర్తకు పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు బీరేంద్ర వర్మ, ఏవీఎం మునిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి జేబీఆర్‌.మునిరత్నం, జిల్లా కార్యదర్శి జగదీష్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అపరంజిరాజు (నాగలాపురం), చలపతిరాజు (పిచ్చాటూరు), మణి నాయుడు (బీఎన్‌కండ్రిగ), నాయుడు దయాకర్‌ రెడ్డి (వరదయ్యపాళెం), సొరకాయలు (నారాయణవనం), నాయకులు చిన్నదొరై, శ్యామ్‌, మహేష్‌ రెడ్డి, భానుప్రకాష్‌ రెడ్డి, విశ్వనాథరెడ్డి, మైనారిటీ సెల్‌ నాయకులు షాపుద్దీన్‌, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

పార్టీ గుర్తింపు కార్డులు అందుకున్న వారితో భూమన, నూకతోటి రాజేష్‌

మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement