శ్రీవారి దర్శనానికి 20 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లులేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్ర మే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో టీటీడీ గోశాలల అభివృద్ధి

– వంతారా ప్రతినిధులతో అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి

తిరుమల: టీటీడీ గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి సూచించారు. శనివారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ గోశాలలను ఉచితంగా అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా విచ్చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వంతారా సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో గోశాలలు, జంతు సంరక్షణ కేంద్రాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వంతార సంస్థ ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అదనపు ఈవోకు వివరించారు. గోశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. స్వామివారి కై ంకర్యాలకు అవసరమైన పాల ఉత్పత్తులలను సాధ్యమైనంత వరకు తిరుమలలోనే ఉత్పత్తి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అదనపు ఈవో సూచించారు. టీటీడీ జేఈవో ప్రభల గోపీనాథ్‌, ఎస్వీ గోశాల డైరెక్టర్‌ శివ కుమార్‌, ఎస్‌ఈ వేణుగోపాల్‌, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

12లోపు నామినల్‌ రోల్స్‌ సమర్పించాలి

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌కు సంబంధించి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను అక్టోబర్‌ 12వ తేదీలోపు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువ పత్రాలు, సంబంధిత రికార్డులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులు పరిశీలించి, అభ్యర్థుల అర్హతను నిర్ధారించుకుని, నామినల్‌ రోల్స్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వాటిని గడువు తేదీలోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సిన బాధ్యత ప్రధా నోపాధ్యాయులదేనని డీఈఓ స్పష్టం చేశారు.

శాంతియుత వాతావరణంలో పోలేరమ్మ జాతర

వెంకటగిరి రూరల్‌ : వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈనెల 30, అక్టోబర్‌ 1వ తేదీల్లో జరిగే జాతరను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని పోలేరమ్మతల్లి జాతర జరిగే ప్రధాన ప్రదేశాలు, అమ్మవారి కుమ్మరిల్లు, జీనుగులవారి వీధి, పోలేరమ్మతల్లి గుడి, రాజావీధి, విరూప మండపం ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శన సమయంలో భక్తులకు కేటాయించిన సర్వదర్శనం, రూ.100, రూ.300 క్యూలోనే వెళ్లాలని సూచించారు. మద్యం కట్టడికి చర్యలు చేపడుతామన్నారు. పోలేరమ్మ తల్లి జాతరను కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. 1,200 మంది పోలీసులు, 100 సీసీకెమెరాలతో నిఘా ఉంచనున్నట్టు చెప్పారు. అడిషనల్‌ ఎస్పీలు రవిమనోహరాచారి, శ్రీనివాసరావు, శ్రీలత, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారి విక్రమ్‌, డీఎస్పీలు చెంచుబాబు, గీతాకుమారి, సీఐ రోశయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement