తిరుమల: తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.
నిర్బంధం
తిరుపతి అర్బన్ : సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు ఉద్యోగులు శనివారం సాయంత్రం బయల్దేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆరో వార్డు సంక్షేమ కార్యదర్శి అమరావతి, 25వ వార్డు సంక్షేమ కార్యదర్శి రజినీకుమారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈస్ట్‌పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.


