పోలేరమ్మా.. చల్లంగా చూడమ్మా! | - | Sakshi
Sakshi News home page

పోలేరమ్మా.. చల్లంగా చూడమ్మా!

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

● వెంకటగిరిలో జాతర కోలాహలం ● నేడు పోలేరమ్మ తల్లి ఘటోత్సవం

వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి విలవేల్పు శ్రీ పోలేరమ్మతల్లి జాతర కోలాహలం మొదలైంది. ఈ నెల 30, అక్టోబర్‌ 1వ తేదీల్లో నిర్వహించనున్న పోలేరమ్మ తల్లి జాతరలో ప్రధాన ఘట్టమైన ఘటోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. తొలుత వెంకటగిరి రాజా ప్యాలెస్‌లో, తర్వాత తాటి పత్రియుల ఇంట పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పట్టణంలోని ప్రతి ఇంటి ముంగిటకు ఘంటం చేరుకోని ప్రత్యేక పూజలందుకుంటుంది.

మద్యం నివారణకు చర్యలు

శ్రీ పోలేరమ్మతల్లి జాతరలో మద్యం కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన శాంతి సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు జాతరలో మద్యం నివారించాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు జాతర జరిగే బుధ, గురువారాల్లో మద్యం షాపులను మూసివేయనున్నారు. అలాగే జంతు బలులను సైతం నిషేధించాలని పశుసంవర్థకశాఖ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాల్సిందే.

పోలేరమ్మ తల్లి (ఫైల్‌)

అమ్మవారి ఘటోత్సవంలో నిర్వాహకులు(ఫైల్‌)

నిఘా నీడలో జన జాతర

పోలేరమ్మ తల్లి జాతరకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. ఈ సారి 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు నేతృత్వంలో ప్రత్యే నిఘాతో జన జాతర ఏర్పా ట్లు సాగుతున్నాయి. నిఘా కోసం పట్టణంలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే వెంకటగిరి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయనున్నారు. నిమజ్జనం చేసే ప్రదేశాల్లో తొక్కిసలాట జరగకుండా ముందస్తుగా 50 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నారు. ఈ సారి రూ.300 టిక్కెట్‌తో పాటు ఉచిత దర్శనం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అనే విషయాలపై సుదీర్ఘంగా చర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement