విజ్ఞానగిరిపై అనకొండలు! | - | Sakshi
Sakshi News home page

విజ్ఞానగిరిపై అనకొండలు!

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

ఆలయ భూములు ఆక్రమిస్తున్నా

చర్యలు శూన్యం

మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

బియ్యపు మధుసూదన్‌రెడ్డి

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన విజ్ఞానగిరి (కుమారస్వామి తిప్ప)పై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి కొండను టీడీపీ నాయకుడు ఆక్రమించుకోవడాని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించారు. కొండను బ్రేకర్‌ యంత్రాలతో తవ్వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. టీడీపీ నాయకుడు బహిరంగంగా ఆక్రమణలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ, తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలను సీజ్‌ చేయకుండా వదిలేయడం ఏంటని నిలదీశారు. అక్రమ నిర్మాణాలుపై ఈఓ, ఎమ్మెల్యే స్పందించకపోవడం అభ్యంతరకరమన్నారు.

ఎందుకు ప్రశ్నించవు పవన్‌?

సనాతన ధర్మం అంటున్న పవన్‌ కళ్యాణ్‌ శ్రీకాళహస్తిలో జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని బియ్యపు మధు ప్రశ్నించారు. ఈ అక్రమ నిర్మాణాలపై తక్షణమే స్పందించి ట్రాక్టర్లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ ఆస్తులను పరిరక్షించడంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లా నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అనంతరం ఈఓకు వినతిపత్రం సమర్పించారు. ఆలయ మాజీ చైర్మన్‌ అంజూరుతారక శ్రీనివాసులు, ఉత్తరాజీ శరవణకుమార్‌, కంఠా ఉదయ్‌కుమార్‌, మున్నారాయల్‌, బుల్లెట్‌ జైశ్యామ్‌ రాయల్‌, శ్రీవారి సురేష్‌, తిరుమల చౌదరి, జయచంద్ర, ముని కృష్ణారెడ్డి, సుమతమ్మ, కొట్టే శరవణ, జీవీకే రెడ్డి, గాదిపాకుల కిరణ్‌, మణి, గుణ పాల్గొన్నారు.

పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

కొండను తవ్విన దృశ్యం

సనాతన ధర్మ పరిరక్షుడికి

కనిపించలేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement