మద్యం షాపునకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

మద్యం షాపునకు దరఖాస్తులు

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

తిరుపతి క్రైం : ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ తిరుపతి రూరల్‌ పరిధిలోని ఓపెన్‌ కేటగిరీకి చెందిన ఒక ఏ4 మద్యం దుకాణం కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియను అక్టోబర్‌ 1వ తేదీ అర్ధరాత్రిలోగా పూర్తి చేయాలన్నారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3 లక్షల డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ)తో ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ పరిధిలోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌, తిరుపతి రూరల్‌లో నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చని చెప్పారు. దరఖాస్తుల ఆధారంగా అక్టోబర్‌ 5వ తేదీన లాటరీ నిర్వహించి షాపును కేటాయించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం తిరుపతి రూరల్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ను సంప్రదించవచ్చని, 9440902543 నంబర్‌లో వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement