పవిత్రం.. పరిసమాప్తం | - | Sakshi
Sakshi News home page

పవిత్రం.. పరిసమాప్తం

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

చంద్రగిరి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీపద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజ స్వామి వారు, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు.

వైభవోత్సవం

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ పద్మా వతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో శరత్‌, సీవీఎస్వో కే.వి.మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఆల య అర్చకులు బాబుస్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్రాయలు, రమేష్‌, సురేష్‌, శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ చలపతి, లక్ష్మీకాంతం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement