తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో డిగ్రీ, పీజీ, పలు డిప్లొ మో కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వై.మల్లికార్జున తెలిపారు. ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు యూజీ, పీజీ, డిప్లొ మో కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోపు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రౌడీ షీటర్‌కు
జ్యుడీషియల్ కస్టడీ
రేణిగుంట: రౌడీషీటర్‌కు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధిస్తూ మండల ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్ శ్రావణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. మండలంలోని గురవరాజుపల్లికి చెందిన రెడ్డిపల్లి ఇబ్రహీంఖలీల్ ఆరేళ్లుగా మద్యానికి బానిసై తరచూ గొడవలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు, గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉంది. అర్బన్ పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీషీట్ ఉంది. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలతో అర్బన్ సీఐ జయచంద్ర గత నెల 20వ తేదీన సదరు వ్యక్తిని రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బైండ్ ఓవర్ చేయించారు. అయితే ఈనెల 15వ తేదీన అర్ధరాత్రి బుగ్గవీధిలో గొడవ పడినట్లు విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి శనివారం మండల ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఆయన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
చెరువులో వ్యక్తి మృతదేహం
సూళ్లూరుపేట రూరల్: మండంలోని దావాదిగుంట గ్రామ చెరువులో రాజేష్(38) మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ అజయ్‌కుమార్ కథనం మేరకు.. నాయుడుపేట పట్టణంలోని బేరిపేట కాలనీకి చెందిన రాజేష్ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. దావాదిగుంట చేరువులో గుర్తుతెలియని మృతదేహమై తేలాడు. కేసు దర్యాప్తులో ఉంది.


