మార్పు వెనుక మతలబు ఏంటో? | - | Sakshi
Sakshi News home page

మార్పు వెనుక మతలబు ఏంటో?

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

● చంద్రగిరి నుంచి కలెక్టరేట్‌కు జెడ్పీ కార్యాలయం మార్పు ● జెడ్పీ చాంబర్‌లోనే.. మరో రెండు విభాగాలు ● ఓ ఎమెల్యే ఒత్తిడితోనే తిరుపతికి మార్చినట్టు చర్చ

సాక్షి, టాస్క్‌పోర్స్‌: అనుకోకుండా జెడ్పీ కార్యాలయాన్ని తిరుపతి కలెక్టరేట్‌కు మార్పు చేయడంలో మతలబు ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన చాంబర్‌లో ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌తోపాటు ఆ విభాగానికి చెందిన పలువురు ఉద్యోగులు, అదే చాంబర్‌లో జిల్లా రెవెన్యూ అధికారికి సంబంధించిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. జెడ్పీ విభాగానికి సంబంధించి జిల్లాకు 60 మంది ఉద్యోగులను కేటాయించినట్లు తెలుస్తోంది. అందులో ఇప్పటి వరకు 40 శాతం మంది మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు కేటాయించిన చాంబర్‌ వీరిందరికీ విధులు నిర్వర్తించడానికి సరిపోతుంది. అంతేతప్ప మూడు విభాగాలకు చెందిన వారికి ఇస్తే అందరికీ అవస్థలే.

ఎందుకు మార్చారబ్బా?

చంద్రగిరి ఎంపీడీ కార్యాలయాన్ని జెడ్పీకి కేటాయిస్తున్నట్టు చిత్తూరు నుంచే అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఆ దిశగా చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రత్యేక భవన నిర్మాణాలు సాగుతున్నాయి. జెడ్పీ కార్యాలయం చంద్రగిరిలోనే ఏర్పాటు చేస్తున్నారనే నిర్ణయానికి వచ్చేశారు. కార్యాలయాన్ని (ఈ నెల 25వ తేదీ) ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ నెల 24వ తేదీ రాత్రి ఓ ఎమ్మెల్యే చంద్రగిరిలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటు చేయరాదని జిల్లా అధికారులపై తీవ్రమైన ఒత్తిడి చేసినట్లు చర్చసాగుతోంది. జిల్లా అధికారులు చేసేది లేక.. అప్పటికప్పుడు జెడ్పీ ఉద్యోగులను కలెక్టరేట్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement