అంతరశాస్త్ర పరిశోధనతో సరికొత్త ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

అంతరశాస్త్ర పరిశోధనతో సరికొత్త ఆవిష్కరణలు

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

తిరుపతి రూరల్‌: అంతరశాస్త్ర పరిశోధనతో జీవశాస్త్ర రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మూడు రోజులుగా నిర్వహించిన ‘అంతరశాస్త్ర జీవశాస్త్ర పరిశోధనను ప్రోత్సహించడం ఓమిక్స్‌, జంతు నమూనాలు, గ్రీన్‌హౌస్‌ సాంకేతికతల ఏకీకరణ’ జాతీయ సదస్సు శనివారం ముగిసింది. చివరి రోజు యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌ ఎ.మధుసూదనరెడ్డి ముఖ్యతిథిగా హాజరై ‘తూర్పు కనుమల్లో స్థానిక, అంతరించిపోతున్న మొక్కల వ్యాప్తి–పరిరక్షణకు వినూ త్న విధానాలు’ అన్న అంశంపై మాట్లాడారు. విశ్వవిద్యాలయ గ్రీన్‌హౌస్‌లో హైడ్రోపోనిక్స్‌, స్థానిక మొక్కల పెంపకంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డి.ఎం.మమత పరిశోధనా ప్రజెంటేషన్లు, శిక్షణా కార్యక్రమాలను వివరించారు. చివరగా ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జిల్లా వ్యవసాయ సలహా, సాంకేతిక బదిలీ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.రామకృష్ణారావు మాట్లాడారు. తర్వాత ఉత్తమ పోస్టర్‌, ఓరల్‌ ప్రజెంటేషన్లకు బహుమతులు అందజేశారు. ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఎ.శ్రీదేవి, టీమ్‌ లీడర్లు ప్రొఫెసర్‌ రజిత, ప్రొఫెసర్‌ పి.ఉమామహేశ్వరిదేవి, ప్రొఫెసర్‌ పి.జ్యోత్స్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement