దోపిడీ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల అరెస్ట్‌

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

రేణిగుంట: తిరుపతి–పుత్తూరు మార్గం తూకివాకం సమీపంలో ఈ నెల 24వ తేదీ రాత్రి పుత్తూరు వైపు వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసి అతని వద్దనున్న మొబైల్‌ ఫోన్‌, నగదు లాక్కున్న ముగ్గురు దారి దోపి డీ దొంగలను శనివారం రాత్రి అరెస్ట్‌ చేసినట్లు గాజులమండ్యం సీఐ మంజునాథ్‌ తెలిపారు. ఆయ న మాట్లాడుతూ నలుగురు వ్యక్తులు ఈ నెల 24వ తేదీ రాత్రి తిరుపతి నుంచి పుత్తూరుకు వెళ్లే మార్గంలో కాపు కాచి ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని అడ్డగించి, దాడికి పాల్పడ్డారని తెలిపారు. అతని వద్దనున్న రూ.500 నగదు, రూ.10 వేల విలువైన మొబైల్‌ ఫోన్‌ లాక్కెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం నిందితులు ఆటో డ్రైవర్‌ చంద్రగిరి మండలం, శానంబట్ల గ్రామానికి చెందిన ఎస్‌.జయకుమార్‌(43), తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మాన్సోడా మండలం, కోయగుట్ట గ్రామానికి చెందిన జే.హనుమంతుడు(33), తిరుప తి కొర్లగుంటకు చెందిన ఎస్‌.మోహిత్‌సాయి(33)ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement