ఆ‘గని’ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ఆ‘గని’ తవ్వకాలు

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

● సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ ● రాష్ట్ర విద్యాశాఖా మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి ● బాధితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్డెక్కిన యువత, విద్యార్థులు ● ఎస్వీయూలో సైబర్‌ స్పేస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు ఆమోదం తెలపండి ● తిరుపతి జిల్లాలో జవహర్‌ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి ● పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 30న చివరి గడువు

కేంద్ర ప్రభుత్వ విజ్ఞాన్‌ మథన్‌కూ సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే స్కాలర్‌ షిప్‌

సైదాపురంలో మండలంలోని పురాతన పల్లిమిట్ట మైన్‌లో మళ్లీ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.
వేడుకల పేరుతో రేణిగుంటలో బీభత్సం
రేణిగుంట పట్టణంలో తుడా చైర్మన్‌ పుట్టిన రోజు వేడుకల పేరుతో కొందరు యువకులు హంగామా సృష్టించారు.

డీఎస్సీ అక్రమాలపై పిడికిలి బిగించిన యువత

బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026

విద్యార్థులు, యువత కదం తొక్కారు. డీఎస్సీ లీకులపై పిడికిలి బిగించారు. కూటమి తీరుపై రగిలిపోయారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో జరిగిన భారీ మోసాలను ఎండగట్టారు. తమ అనుయాయులకు ఉద్యోగాలిచ్చి.. అర్హులైన వారికి మొండిచేయి చూపడం దుర్మార్గమని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాదిరిగా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ కూడా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌.. డీఎస్సీ అక్రమాలపై న్యాయం చేయాలి. లోకేష్‌ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు మిన్నంటించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మధ్యలో కొందరు తెలుగు తమ్ముళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు వారిని నిలువరించకపోవడం విమర్శలకు తావిచ్చింది.

అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి ఆర్‌కే రోజా

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వద్ద వైఎస్సార్‌సీపీ

యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

నేటి నుంచి

జాతీయ సదస్సు

తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, హరిత రసాయన శాస్త్రం, స్థిరమైన రసాయన సమ్మేళనాల సంశ్లేషణ, నూతన పరిశోధనలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ ఎన్‌.వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖ శాస్త్ర వేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు హాజరై పరిశోధన పత్రాలు సమర్పిస్తారని తెలిపారు. టీటీడీ జేఈవోలతో పాటు, డీఈఓ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు.

బీమా చేయించుకోండి

తిరుపతి అర్బన్‌: నిమ్మ రైతులు ఖరీప్‌ సీజన్‌కు సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి జయభరత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,822 మంది రైతులు 9,884 ఎకరాల్లో నిమ్మపంట సాగు చేశారని చెప్పారు. వీరంతా ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, తక్కువ వర్షపాతం, తీవ్ర ఉష్ణోగ్రత్తలు తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కలిగే నష్టాలకు బీమా రక్షణ ఉంటుందని వివరించారు. రైతు ప్రీమియం ఎకరానికి రూ.2,530 చెల్లించాలని స్పష్టం చేశారు. బీమా మొత్తం హెక్టారుకు రూ.1,25,000 వస్తుందని వివరించారు. బీమాను కట్టుకోవడానికి ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని వెల్లడించారు. అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రం, బ్యాంక్‌, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చని వివరించారు.

ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించండి

తిరుపతి అర్బన్‌: ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎల్‌నినో కారణంలో నెలకొంటున్న సమస్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు ఎరువులు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. తప్పులు లేకుండా సర్వే గడువులోపు పూర్తి చేయాలని వెల్లడించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామ్మోహన్‌, భానుప్రకాష్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, అగ్రికల్చర్‌ జేడీ ప్రసాద్‌రావు, ల్యాండ్‌ అండ్‌ రికార్డ్స్‌ రామచంద్ర పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

15 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 80,003 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,918 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

భూసేకరణ పనులు ముమ్మరం

తిరుపతి అర్బన్‌: జాతీయ రహదారుల నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ గోవిందరావు కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులు ఉంటే వాటికి పరిష్కారం చూపాలని చెప్పారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్‌హెచ్‌ పీడీలు, ఏపీఐఐసీ అధికారులు, పంచాయితీరాజ్‌, ఇరిగేషన్‌ విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు.

నిరుద్యోగుల భవిష్యత్‌తో చెలగాటం

చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. ఉద్యోగం ఇవ్వరు.. నిరుద్యోగ భృతి చెల్లించరు. ప్రభుత్వ ఉద్యోగాలు కోట్లు రూపాయలకు అమ్ముతున్నారు. ఇదేనా యువతకు చేస్తున్న మేలు. అమలు కాని హామీలు ఇచ్చి యువతను మోసం చేశారు. – ఉదయ్‌వంశీ, వైఎస్‌ఆర్‌సీపీ

జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు

బకాయిలు చెల్లించాలి

పేద విద్యార్థులకు చెల్లించాల్సిన వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంట నే చెల్లించాలి. ఆర్థిక భారం లేకుండా తల్లిదండ్రులకు బాసటగా నిలబడాలి. – మల్లం రవి,

రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ యువజనవిభాగం కార్యదర్శి

నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల నుంచే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లయ్యింది. ఆ మాటే అనుకోలేదు. – స్వరూప్‌, తిరుపతి నియోజకవర్గ

విద్యార్థి విభాగం అధ్యక్షుడు

న్యాయం చేయాలి

డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా కింద జరిగిన అన్యాయంతో బాధితులుగా మిగిలిన వారికి ప్రభుత్వం తక్షణం న్యాయం చేయాలి. – చెంగల్‌రెడ్డి, చంద్రగిరి

నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు

బాధితులకు ఉద్యోగాలివ్వాలి

డీఎస్సీలో జరిగిన అక్రమాలతో ఉద్యోగం పోగొట్టుకు ని తీవ్ర ఆవేదనతో నలిగిపోతున్న వారికి న్యాయం జరగాలి.

– శ్రీహరి సురేష్‌, శ్రీకాళహస్తి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు

తిరుపతి రూరల్‌: డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి.. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. తిరుపతి వేదికగా మంగళవారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు ఉదయ్‌ వంశీ, రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు ఓబుల్‌ రెడ్ది ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ర్యాలీకి మాజీ మంత్రి ఆర్‌కె.రోజా హాజరై సంఘీభావం తెలపడంతో విద్యార్థులు, యువత ఉత్సాహంగా ముందుకు కదిలారు. ర్యాలీలో ప్లకార్డు చేతబట్టి విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలి అంటూ ఆమె గట్టిగా అరుస్తూ అడుగులు ముందుకు వేశారు. తిరుపతి, చంద్రగిరితోపాటు జిల్లా నలుమూలల నుంచి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తమ్ముళ్ల కవ్వింపు చర్యలు

తిరుపతి–చంద్రగిరి ప్రధాన రహదారిలో శాంతియుత ర్యాలీ జరిపి శ్వేత భవనం ముందు మీడియాతో మాజీ మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడారు. అటువైపు ర్యాలీగా వచ్చిన టీడీపీకి చెందిన కొందరు తమ్ముళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తుడా చైర్మన్‌ జన్మదినం సందర్భంగా విద్యానగర్‌ నుంచి తిరుపతి నగరంలోకి పలువురు టీడీపీ నేతలు బైక్‌ ర్యాలీతో అదే మార్గంలో రావడం, ఎస్వీయూ గోల్డెన్‌ ఆర్చి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్న నాయకులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. అలాగే బైక్‌ హారన్‌లను మోగించారు. ఇదంతా పోలీసులు దగ్గ రుండి చూస్తున్నా అడ్డుచెప్పే ప్రయత్నం చేయ లేదు.

ర్యాలీలో నినదిస్తున్న

యువత, నాయకులు

నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల : తిరుమలలో బుధవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు బంగారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి సేవను

గ్రామ స్థాయికి విస్తరిస్తాం

తిరుమల : శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించేందుకు టీటీడీ కార్యాచరణ చేపట్టిందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌న్‌లో గ్రూప్‌ సూపర్‌వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించే అవకాశాలను గుర్తించి టీటీడీ దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. శ్రీవారి సేవకుల పనితీరును ఆధారంగా చేసుకుని సిబిల్‌ స్కోర్‌ తరహాలో రేటింగ్‌ వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఆ రేటింగ్‌ ఆధారంగా విధుల కేటాయింపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఎస్‌.ఎల్‌.ఎన్‌.టి.శ్రీనివాస్‌, చైన్నెకి చెందిన శరత్‌ను ఈవో శాలువాతో సత్కరించారు. టీటీడీ సీపీఆర్వో డాక్టర్‌ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ, శ్రీవారి సేవా సదన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

‘నైలెట్‌ ’ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయాలి

అపూర్వ అవకాశం..

వరిస్తే మరింత అదృష్టం

తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం లోకసభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నైలెట్‌) శాశ్వత క్యాంపస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్‌ స్పేస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, తిరుపతి జిల్లాలో జవహర్‌ నవోదయ విద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాల న్నారు. ప్రస్తుతం శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు భూ కేటాయింపు, డీపీఆర్‌ సమర్పణ వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, నైలెట్‌ సంస్థ మధ్య చర్చల్లో ఉన్నాయని కేంద్రం ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి శాశ్వత క్యాంపస్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. అలాగే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాధిత సైబర్‌ స్పేస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్‌న్స్‌ని కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆమోదం తెలిపి చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనువైన భూమి ఇప్పటికే గుర్తించినప్పటికీ, ఇప్పటికీ నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. ఈ అంశాలపై ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు ఎంపీ తెలిపారు.

తిరుపతి సిటీ: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ సరికొత్త కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు, విజ్ఞాన్‌.. మంథన్‌ స్కాలర్‌ షిప్‌ పోటీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

బాల మేధావులకు అవకాశం

విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి పెంచి భావిభారత శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 32వ జాతీయ బాలల కాంగ్రెస్‌ పోటీలను (ఎన్‌సీఎస్‌సీ) దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. అన్ని రకాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులే. ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈనెల 30లోపు ఈ పోటీలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు విద్యార్థులు టీమ్‌గా ఏర్పాడి ఓ గైడ్‌ పర్యవేక్షణలో ప్రధానంగా ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, భారతీయ విజ్ఞాన వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ చూపితే రాష్ట స్థాయిలో రాణించాలి. రాష్ట స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తుతో పాటు మరిన్ని వివరాలపై ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు సమాచారం అందించారు. సైన్స్‌ ఉపాధ్యాయులను సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవడానికి సులువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

హెచ్‌ఎంపై డీఈవో ఆగ్రహం

ఏర్పేడు: మండలంలోని పాపానాయుడుపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్‌. కుమార్‌ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఇందులో విద్యార్థుల రోజువారీ సగటు హాజరుకు మించి కోడిగుడ్లను అధికంగా ఇండెంట్‌ చేసి పాఠశాలకు సరఫరా చేయించడమే కాకుండా, వాటినే సుమారు నెల రోజుల పాటు విద్యార్థులకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారం పై డీఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు జారీచేసి, పూర్తి వివరణ సమర్పించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాలు, విషయ పరిజ్ఞానం, నేర్చుకునే స్థాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సూచనలు జారీ చేశారు. రోజువారీ సగటు విద్యార్థుల హాజరును అనుసరించి మాత్రమే కోడిగుడ్లు, చిక్కీలకు ఇండెంట్‌ ఇవ్వాలని తెలిపారు.

సమగ్ర విచారణ చేపట్టాలి

డీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అప్పటి వరకు నారా లోకేష్‌ను విద్యాశాఖ మంత్రిగా తప్పించాలి.

–ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ

విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు?

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రీయంబర్స్‌మెంట్‌ రావ డం లేదు. బకాయిల మాట ఎత్తడం లేదు. పేద విద్యార్థులు చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు రాకపోవడంతో కూలి పనులకు వెళుతున్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి. – దినేష్‌, తిరుపతి నగర

యువజన విభాగం అధ్యక్షులు, తిరుపతి

నారా లీకేజ్‌ రాజీనామా చెయ్‌

మంత్రి నారా లోకేష్‌ నారా లీకేజ్‌గా మారాడు. డీఎస్సీ పేపర్‌ లీకేజ్‌తో పాటు అవినీతికి పాల్పడి తమ అనుచరులకు పోస్టులు అమ్ముకున్నారు. 427పైగా పోస్టులు అనర్హులకు కట్టబెట్టారు. 20లక్షల ఉద్యోగాలంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అండ్‌ కో కేవలం 16వేల డీఎస్సీని సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేవలం 100రోజుల్లో 1.50లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎంటువంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా భర్తీ చేశారు. రాష్ట్రంలో 191మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోటిమందికి పైగా నిరుద్యోగులు కడుపును చేతిలో పెట్టుకుని ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారు. భజన పత్రికలు ప్రభుత్వ వైఫల్యాలను పట్టించుకోకుండా చంద్రబాబుకు భజన చేస్తున్నాయి. మంత్రి లోకేష్‌ రాజీనామా చేసేంత వరకు వైఎస్సాఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.

– ఆర్‌కే రోజా, మాజీ మంత్రి

లోకేష్‌ కూడా రాజీనామా చేయాలి

నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి.

– నరేష్‌, జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి

అమలు కాని హామీలతో అందలం

అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయ డం లేదు. దానిపై ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులతో జైలుకు పంపుతున్నారు. ఇలాగే చేస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం. – శశిధర్‌రెడ్డి,

రాష్ట్ర యువజన విభాగం సహాయ కార్యదర్శి

భృతి చెల్లించాలి

ఉద్యోగం లేకుండా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న యువతకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించి ఆదుకోవాలి. న్యాయం జరిగే వారకు మా పోరాటం ఆగదు.

– సాయిరాయల్‌,

తిరుపతి రూరల్‌ యువజన విభాగం అధ్యక్షుడు

ప్రతిభకు పట్టం

విద్యార్థుల ప్రతిభను జాతీయ స్థాయిలో పరీక్షించి ప్రొత్సహించేందుకు కేంద్రప్రభుత్వం విజ్ఞాన్‌..మంథన్‌ పేరుతో ప్రతిభాన్వేషణ్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ఆరవ తరగతి నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష తెలుగుతో పాటు 14 భాషల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి సెప్టెంబర్‌ 30వ తేదీ చివరి గడువు. అక్టోబర్‌ ఒకటో తారీఖు నుంచి పాఠశాల స్థాయి తొలి లెవల్‌ పరీక్షను నిర్వహించనున్నారు. నాలుగు స్టేజ్‌లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాది పాటు భాస్కరా స్కాలర్‌షిప్‌లను కేంద్రప్రభుత్వం అందించనుంది. రిజిస్ట్రేషన్‌ కోసం విద్యార్థులు httpr://vvm.orf.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement