●
సైదాపురం: సైదాపురానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ అటవీ ప్రాంతంలో ఉన్న పురాతన పల్లిమిట్ట మైన్‌లో అలజడి నెలకొంది. మంగళవారం ఆ అటవీ ప్రాంతంలో ఉన్న పల్లిమిట్ట అనే పేరుగల గనిలో కూలీల చేత పనులు చేయిస్తున్నారనే సమాచారం అధికారులకందింది. అటవీ, స్థానిక పోలీసులతో పాటు పలువురు ఆ గని ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కూలీలు అక్కడి నుంచి ఉడాయించేందుకు ప్రయత్నించగా.. అటవీ అధికారులు ఓ మేసీ్త్రని అదుపులోకి తీసుకున్నారు. పనులు చేస్తున్న సమయంలో అక్కడే పారలు, ఇతర సామగ్రిని వదిలివేశారు. వాటితో పాటు ఆటోను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లీజుకు దరఖాస్తు
ఆ గనిని కొందరు స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గూడూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మైనింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గనికి లీజు వేసిన వ్యక్తులే పనులు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కఠిన చర్యలు తప్పవు
అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవు. సైదాపురం సమీపంలోని పల్లె మిట్ట మైన్‌లో కూలీలచేత పను లు చేయిస్తున్నట్టు సమాచారం అందడంతో తమ సిబ్బంది దాడులు చేశారు. కొందరిని అదుపులో కి తీసుకున్నాం. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నాం. – మాల్యాద్రి, నెల్లూరు అటవీ శాఖ రేంజర్


