నేల బావిలో గుర్తుతెలియన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

నేల బావిలో గుర్తుతెలియన వ్యక్తి మృతి

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

దొరవారిసత్రం: కల్లూరు గ్రామ పరిధిలోని కోటచెరువు సమీపంలో ఉన్న నేలబావిలో 35–40 ఏళ్లు వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు... కల్లూరు గ్రామానికి చెందిన కొందరు మేకల కాపారులు మేకలను మేపుకుని తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో నేలబావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని వెలికి తీశారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement