శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం ఆగమోక్తంగా ఊంజల్ సేవ జరిగింది. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు పలు రకాల అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరిచారు. ధూప, దీప నైవేద్యాల అనంతరం మేళతాళాలు, మంగల వాయిద్యాల నడుమ ఉంజల్ మండపం వద్దకు స్వామి, అమ్మవార్లను వేంచేపు చేశారు. ఊంజల్‌పై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బీకే వెంకటేశులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


