ముక్కంటి సేవలో వారణాసి ఆలయ ప్రధాన అర్చకులు | - | Sakshi
Sakshi News home page

ముక్కంటి సేవలో వారణాసి ఆలయ ప్రధాన అర్చకులు

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని మంగళవారం వారణాసి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్‌మిశ్రా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వామికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మహాన్యాస రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంఠా ఉదయ్‌, శ్రీవారి సురేష్‌, మున్నారాయల్‌, జయశ్యామ్‌ రాయల్‌, శశి, భాను, సతీష్‌, సూరయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement