తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం సంస్థ పరిధిలోని తొమ్మి ది జిల్లాల అధికారులు, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆయా జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆగస్టు నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలన్నారు.
డయల్ యువర్ సీఎండీకి 58 ఫిర్యాదులు
ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీకి విద్యుత్తు వినియోగదారుల నుంచి 58 ఫిర్యాదులు వచ్చినట్టు సీఎండీ శివశంకర్ తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా జిల్లాల అధికారులకు పంపించి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు. డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కే. ఆదిశేషయ్య, జే.రమణాదేవి, ఆర్.పద్మ, ఎం.మురళికుమార్, ఎన్.శోభావాలెంటీనా, సీహెచ్ రామచంద్రరావు, కే.సంపత్‌కుమార్, ఎస్.రమణ, జనరల్ మేనేజర్లు శ్రీకాంత్, చక్రపాణి, జగదీష్, భాస్కర్‌రెడ్డి, లత, ఎస్‌ఈలు శేషాద్రి శేఖర్, మోజెస్, ప్రదీప్‌కుమార్, సుధాకర్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, చంద్రశేఖరరావు, సోమశేఖర్‌రెడ్డి, అమర్‌బాబు పాల్గొన్నారు.


