తిరుపతి కల్చరల్: నేటి ఆధునిక సమాజంలో సీ్త్ర విలువ పెంచే చట్టాలు రావాలన్న లక్ష్యంగా సాగిన ‘సీ్త్ర సూక్తం’ పద్యనాటకం జనాలను మేల్కొలిపింది. అభినయ ఆర్ట్స్ 26వ వార్షికోత్సవంలో భాగంగా మహతి కళాక్షేత్రంలో చేపట్టిన జాతీయ స్థాయి నృత్య, నాటక పోటీలు గురువారంతో ఆరో రోజుకు చేరాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కళా బృందాలు ప్రదర్శించిన శాసీ్త్రయ, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆలరింపజేశాయి. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చెందిన శ్రీశ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారి ‘సీ్త్ర సూక్తం’ పౌరాణిక పద్యనాటక ప్రదర్శన సభికులను ఆలోచింపజేసింది. పురుష సూక్తం పోయి సీ్త్ర సూక్తం రావాలని ఈ నాటిక ద్వారా చాటారు. అనంతరం విశాఖపట్నం శ్రీతెలుగు కళాసమితివారు ప్రదర్శించిన ‘చిటికిన వేలు’ సాంఘిక నాటిక సందేశాత్మంగా నిలిచింది. నృత్య, నాటక ప్రదర్శన కళాకారులను అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్.రెడ్డి, ప్రతినిధులు జ్ఞాపికలు, పారితోషకంతో ఘనంగా సత్కరించి అభినందించారు.


