ధ్వంసం చేయడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ధ్వంసం చేయడం సరికాదు

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

వెంకటగిరి (సైదాపురం): తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను బుధవారం రాత్రి పోలీసులు, రెవె న్యూ అధికారులు ధ్వంసం చేయడం సరికాదని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని, పట్టా స్థలంలో వరదనీరు పొలంలోకి రానివ్వకుండా నిర్మించుకున్న ప్రహరీని అధికారులు కూల్చివేయడం దారుణమన్నారు. భవిష్యత్‌లో అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఆగస్ట్‌ 22న ఐఐటీ

8వ స్నాతకోత్సవం

ఏర్పేడు: తిరుపతి ఐఐటీ 8వ స్నాతకోత్సవం ఆగస్టు 22న ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్టు ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌.సత్యనారాయణ తెలిపారు. ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని పట్టభద్రులైన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

27న ఐఐటీలో యువంతర్‌ –2026

ఈనెల 27న తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఐఐటీలో బీటెక్‌ కోర్సుల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు యువంతర్‌– 2026 పేరిట తమ అకాడమిక్‌ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఓరియంటేషన్‌, ఇంట్రడక్షన్‌ ప్రోగ్రామ్‌ జరుతుందని ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎం.నబిల్‌ లాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement