లీకులపై గర్జిద్దాం రండి! | - | Sakshi
Sakshi News home page

లీకులపై గర్జిద్దాం రండి!

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

విద్యార్థుల ప్రాణాలు పోతున్నా

నోరు మెదపరా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ

పాలనపై గళం విప్పుదాం రండి

విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నేడు విద్యాసంస్థల బంద్‌

తిరుపతి సిటీ: ‘పోటీ పరీక్షల పేపర్లు లీకవుతున్నాయి. దీనికి బాధ్యత వహించాల్సిన పాలకులు తప్పించుకుంటున్నారు. గళం విప్పుతున్న వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీతో ఇప్పటికే 24 మంది ప్రాణాలు వదిలారు. వీరి ఆత్మశాంతికై నా రండి.. పోరాడుదాం.. ఐకమత్యంగా గళం విప్పుదాం..’ అంటూ విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌ పాటించనున్నట్టు పేర్కొన్నారు.

నోరు మెదపరెందుకు బాబూ?

ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ప్రగల్భాలు పలికే డిప్యూటీ సీఎం పవన్‌ నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై స్పందించక పోవడం దారుణమని పలువురు ఎండగడుతున్నారు. సీఎం చంద్రబాబు, యువగళం అంటూ హంగామా చేసిన మంత్రి లోకేష్‌ యువతకు జరిగిన అన్యాయంపై నోరు మెదపరా..! అంటూ ప్రశ్నిస్తున్నారు. నీట్‌ లీక్‌పై కూటమి సర్కార్‌ వైఖరికి నిరసనగా శుక్రవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు.

నీట్‌ లీకేజ్‌పై పవన్‌, బాబు స్పందించరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement