కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది. నీట్ లీకేజ్‌తో విద్యార్థులు డాక్టర్ కలకు దూరమయ్యారు. అవినీతికి పాల్పడ్డ మంత్రికి ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారు. యువత తిరగబడితే ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకమే. తస్మాత్ జాగ్రత్త.
–సుందరరాజు, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ, జాతీయ అధ్యక్షుడు
అవినీతికి అడ్డాగా ఎన్‌టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూటమి సర్కార్ అవినీతికి అడ్డగా మార్చుకుంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు దోచుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. ఉన్నత విద్యను పేదలకు దూరం చేసేందుకు ప్రయత్నిస్తే తిరగుబాటు తప్పదు. – చిన్న, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమతి సభ్యులు, తిరుపతి
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పేపర్ లీక్‌తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి కుటుంబాలకు భరోసా ఎవరిస్తారు. యువత ప్రాణాలు పోతున్నా మోదీ సర్కార్ చలించకపోవడం దారుణం. తక్షణం ఎన్‌టీఏని రద్దు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలి. –అక్బర్, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి, తిరుపతి
స్పందించరా?
నీట్ లీకేజ్‌పై యవతరం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించకపోవడం దారుణం. విద్యార్థుల ప్రాణాలు అంటే అంతా చులకనా..?. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఏ అవినీతికి వత్తాసు పలకుతోందా?.
–ప్రేమ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షులు, తిరుపతి


