వైఎస్సార్‌సీపీ నేత కారుపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత కారుపై దాడి

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: నగరంలోని హరేకృష్ణ రోడ్డులో వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల ఉపాధ్యక్షుడు రాజేష్‌రెడ్డి కారుపై శుక్రవారం గుర్తు తెలియని దుండగులు చేసిన దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో కారు వెనుక వైపు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న రాజేష్‌రెడ్డి తన కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి, అలిపిరి పోలీసుసేష్టన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఆకతాయిలు మద్యం మత్తులో బీరు బాటిళ్లతో అద్దాలను పగులగొట్టారనే అనుమానాలకు తావిస్తోంది. అయితే విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన కారును పరిశీలించి రాజేష్‌రెడ్డితో మాట్లాడారు. ఎలా జరిగిందని, దీని వెనుక ఎవరైన కుట్ర చేశారా? లేదా అనే విషయాలను ఆరా తీశారు. పోలీసుల విచారణలో ఎవరనేది తెలుస్తుందనే విషయాన్ని రాజేష్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఉదయ్‌ వంశీ, దినేష్‌రాయల్‌, మల్లం రవి, ఇమ్రాన్‌, వాసూ యాదవ్‌, పసుపులేటి సురేష్‌, రమణారెడ్డి, అనిల్‌రెడ్డి, అరుణ్‌యాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement