ట్రాక్టర్‌ అద్దె పెంచేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ అద్దె పెంచేస్తున్నారు

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

డీజిల్‌ పెంచారని ట్రాక్టర్‌ అద్దెను పెంచేస్తున్నారు. దీంతో పెట్టుబడి పెరుగుతుంది. అయితే తీర ఒబ్బిళ్ల సమయంలో వరి పంటతోపాటు ఇతర పంటలకు సరైన గిట్టుబాటు ధర ఉండడం లేదు. సాధారణంగా డీజిల్‌పై 20 నుంచి 30 పైసలు పెంచితేనే రైతులకు భారం. అయితే ఒక్కసారిగా లీటర్‌పై రూ.3 పెంచడంతో రైతులకు పెద్ద దెబ్బ. ధరలు పెరగడంతో రైతుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. – బి. శ్రీనివాసులు, రైతు, గొల్లపాళెం, వాకాడు మండలం

పెట్రోల్‌ ధరలు ఇంత ఎప్పుడూ

పెంచలేదు

సాధారణంగా లీటర్‌ పెట్రోల్‌పై 50 లేదా 60 పైసలు పెంచడం చూస్తున్నాం. ఇలా లీటర్‌పై రూ.3 పెంచడం దారుణం. చిన్నపాటి ఉద్యోగి బడ్జెట్‌ పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి, పేదోడికి ఇంధనం భారం పడకుండా చూడాల్సి ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ ధరలు ఉన్నట్లు తెలుస్తుంది. సామాన్య జనాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్‌ ధరలు తగ్గించాలని కోరుతున్నాం. – వినోద్‌కుమార్‌, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement