వడదెబ్బకు వ్యవసాయ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వ్యవసాయ కూలీ మృతి

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

ఏర్పేడు: మండలంలోని మడిబాక అరుంధతీవాడకు చెందిన మోటుపల్లి కృష్ణయ్య(47) అనే వ్యవసాయ కూలీ శనివారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మడిబాక అరుంధతీవాడకు చెందిన కృష్ణయ్య శనివారం గ్రామంలోని ఓ రైతు పొలంలో కూలి పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ నుంచి ఇంటికి చేరుకోగానే నీరసించి కళ్లు తిరిగి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతిలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement