తిరుపతి సిటీ: జిల్లాలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం జరగనుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కోసం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులు, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో 650 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 750 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, పరీక్ష సమయానికి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని హెచ్చరించారు.
ఎట్టకేలకు ప్రీ పీహెచ్‌డీ
ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూలో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ప్రీ పీహెచ్‌డీ–2025 పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతలు పలుసార్లు వర్సిటీ అధికారులకు విన్నవించారు. దీంతో శనివారం ఫలితాలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు.


