తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పలు సెమిస్టర్లకు సంబంధించి పరీక్షల ఫీజు గడువు ఈనెల 19వ తేదీతో ముగియనుందని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ స్టడీ సర్కిల్ కోఆర్డిరేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 21 నుంచి 28వ తేదీ వరకు, రెండో సెమిస్టర్ పరీక్షలు జూన్ 30 నుంచి జూలై 6వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. అలాగే పలు పీజీ కోర్సులకు సంబంధించి సెకండ్ ఇయర్ పరీక్షలు జూలై 10 నుంచి 15వ తేదీ వరకు, ఫస్ట్ ఇయర్ పరీక్షలు జూలై 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ కోర్సులకు సంబంధించి పరీక్ష ఫీజుతో పాటు మరిన్ని వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఇంధన పొదుపు
సామాజిక బాధ్యత
తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వాహన వినియోగదారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొరప్రాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్ర పంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన వినియోగం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, పర్యావరణ, వాయు కాలుష్యం, భవిష్యత్‌లో ఏర్పడే ఇంధన కొరత వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోటారు వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, అతికా నాజ్ పాల్గొన్నారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ప్రక్రియ పూర్తి
తిరుపతి తుడా: మదనపల్లి డి అడిక్షన్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చేపట్టిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఇంటర్వ్యూల ప్రక్రియ తిరుపతి రుయా ఆస్పత్రిలో రెండు రోజులపాటు నిర్వహించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఫైవ్ మెన్ కమిటీని నియమించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, రుయా ఏడీ రమేష్ బాబు, మదనపల్లె ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించారు. ఇంటర్వ్యూ అనంతరం మెరిట్ లిస్టును జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.


