పంటలపై ఏనుగుల దాడులు | - | Sakshi
Sakshi News home page

పంటలపై ఏనుగుల దాడులు

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

– 8లో

చిన్నగొట్టిగల్లు మండలంలోని బోగలవారిపల్లె లో పంటలపై ఏనుగులు దాడులు చేశాయి. దీంతో పంట నష్టం జరిగింది.

ఇంటర్‌ సప్లిమెంటరీ

పరీక్షకు పటిష్ట భద్రత

తిరుపతి అర్బన్‌: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాత పరీక్షలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్‌ 4 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌గా పనిచేస్తారని చెప్పారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,688 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,264 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement