తిరుపతి అన్నమయ్యసర్కిల్:తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్రానికి తెలిపారు. శనివారం ఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ గురుమూర్తి భేటీ అయ్యారు. తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు తిరు పతి విమానాశ్రయం సమీపంలోని ప్రతిపాదిత భూమి ని త్వరగా స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, హాస్టళ్లు, ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రధా న టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని, ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. శ్రీకాళహస్తి, నడికుడి రైల్వేలైన్ తుది దశ పనులను వేగవంతం చేయాల న్నారు. సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించాలన్నారు. గూడూరులోని అంబేడ్కర్‌నగర్ అండర్‌పాస్ విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని, వెందోడు రైల్వేస్టేషన్‌లో కృష్ణ, పూరి ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి వెస్ట్ రైల్వేస్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమన్నారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ప్రతిపాదించిన ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పాలసీ, లా అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్ సైబ ర్ స్పేస్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందించాలని ఎంపీ, కేంద్రమంత్రిని కోరారు.


