న్యూస్‌రీల్
13వేల మంది రైతులకు ఊరట
చంద్రబాబు పాలనలో రెండుసార్లు మూత
2004లో అప్పటి వైఎస్సార్ పాలనలో రీఓపెన్
ఎంపీ గురుమూర్తి కృషితో అందుబాటులోకి రానున్న ఫ్యాక్టరీ
సరికొత్త పాలి‘టెక్నిక్’
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఈ ఏడాది నుంచి రూపురేఖలు మారనున్నాయి. నూతన సిలబస్ అమలు చేయనున్నారు.
రైతులకు
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026
శ్రీవేంకటేశ్వర సహకార
చక్కెర కర్మాగారం
జిల్లా రైతులకు తీపి కబురందింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషితో శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫ్యాక్టరీ ఆస్తుల పరిరక్షణతోపాటు షేర్‌హోల్డర్లు అయిన రైతులకు మేలు జరగనుంది. ఉద్యోగులకు జీవనోపాధి కలగనుంది. దీనిపై ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తిరుపతి అర్బన్: రేణిగుంట మండలంలోని గాజులమండ్యం శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. మూతపడిన ఫ్యాక్టరీని తిరిగి చెరుకు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. రెండేళ్లుగా రైతుల పక్షాన పోరాటం చేస్తున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ వార్తతో షెర్‌హోల్టర్లు అయిన 13 వేల మంది రైతులు, 850 మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.2,150 కోట్లు ఆస్తికి భద్రత
శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని 165 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీకి వచ్చిన ఆదాయంతో పుత్తూరు మార్గంలోని అంజేరమ్మకనం వద్ద 20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మొత్తం 185 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 2,150 కోట్లు పలుకుతుందని రైతులు అంటున్నారు. ప్రధానంగా ఆ భూములను కొందరు బడా నేతలు కబ్జాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత లభించిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాబు పాలనలో రెండు సార్లు మూత
శ్రీవేంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 1972లో రోజుకు 1,250 టన్నులు చెరుకు క్రషింగ్ సామర్థ్యంలో అప్పటి ప్రభుత్వం 165 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. అయితే 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చెరుకు సాగు తగ్గిందంటూ ఫ్యాక్టరీని మూత వేశారు. ఆ తర్వాత రైతులు అభ్యర్థన మేరకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్టరీని 2004–05 సీజన్‌లో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా రోజుకు 1,650 టన్నులు క్రషింగ్ చేసే సామర్థ్యం పెంచారు. ఫ్యాక్టరీ ఎండీగా జాయింట్ కలెక్టర్ హోదా ఉన్న వ్యక్తిని నియమించారు. అయితే 2015లో చంద్రబాబు పాలనలో జాయింట్ కలెక్టర్ హోదా ఉన్న అధికారికి కాకుండా సాధారణ ఉద్యోగికి ఎండీ పగ్గాలు కట్టపెట్టారు. ఈ క్రమంలో వారు ఫ్యాక్టరీ పరిధిలో కేవలం 25 వేల టన్నులు మాత్రమే చెరుకు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలోనే 2015లో మరోసారి మూతవేశారు.
రైతులు తిరిగి ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకురావాలని తమకు చెరుకు పంట సాగు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఓ సంఘంగా ఏర్పడి పోరాటాలు చేస్తున్నారు. చివరిగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సహకారంతో సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎంపీ పదే పదే కేంద్రానికి తెలియజేయడంతో తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీకి మోక్షం
కేంద్ర సహకార మంత్రిత్వశాఖ సానుకూలం
శ్రీవేంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, ఆధునీకరణ అంశంపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు కేంద్ర సహకార శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశానుసారం నేను ఈ చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతోపాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లాను. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.
–మద్దిల గురుమూర్తి,
పార్లమెంట్ సభ్యుడు, తిరుపతి


