కష్టేఫలి.. ర్యాంకులే మరి | - | Sakshi
Sakshi News home page

కష్టేఫలి.. ర్యాంకులే మరి

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

– 8లో

– 8లో

ఏపీపీజీఈసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించిన కీర్తన

37, 3 ర్యాంకులు సాధించిన గురువర్ధన్‌

పేట్రేగిపోతున్న భూ మాఫియా
భూమాఫియా పేట్రేగిపోతోందని వైఎస్సార్‌ సీసీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి ఆరోపించారు.

ఒక్కొక్కరిది ఒక్కొ కష్టం.. ఒక్కొక్కరి ఒక్కొ సమస్య.. అయితేనేం వారి లక్ష్యం ముందు కష్టాలు చిన్నబోయాయి. చదువుకోవాలన్న వారి జిజ్ఞాస ఎదుట పేదరికం తలవంచింది. వారి అకుంఠిత దీక్ష, దృఢ చిత్తానికి సమస్యలు సలాం చేశాయి. ఫలితంగా పేదింటి బిడ్డలు ఏపీపీజీఈసెట్‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అబ్బుర పరిచారు.

నాగలాపురం: ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్‌ 2026– పరీక్షలో నాగలాపురం మండలం, ఎస్‌.ఎస్‌.పురం గ్రామానికి చెందిన దాసరి సుధాకర్‌, లోకమ్మ దంపతుల కుమార్తె కీర్తన ప్రతిభ చాటింది. బయోటెక్నాలజీపై ఆసక్తితో విజయవాడలో బీటెక్‌ బయో టెక్నాలజీ పూర్తి చేసింది. ఎంటెక్‌ బయోటెక్నాలజీలో ప్రవేశం పొందేందుకు ఇంటి వద్దే స్వీయ శిక్షణ పొందిన కీర్తన 61 మార్కులతో రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించింది. ఆమె ప్రాథమిక విధ్యను నాగలాపురంలో పూర్తి చేసింది. అనంతరం పుత్తూరులో ఉన్నత విద్య అభ్యసించింది. తండ్రి కష్టాన్ని గుర్తించిన తనయ కీర్తన పట్టుదలతో చదివి బయోటెక్నాలజీలో డాక్టరేట్‌ చేసి సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొంది. గ్రామీణ ప్రాంత విధ్యార్థిని తొమ్మిదో ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు, కుటుంబసభ్యులు, స్నేహితులు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తన కష్టాలు

కూతురు పడకూడదని..

చదువుల ‘కోట’

తొట్టంబేడు: రైతు కుటుంబంలో పుట్టిన కోట గురువర్ధన్‌ చదువుల కోట అని పలువురు ప్రశంసిస్తున్నాడు. కోట గురువర్థన్‌ ఎటువంటి కోచింగ్‌ తీసుకోకుండా ఇంటి వద్దే కూర్చుని చదివి, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఎంటెక్‌ ప్రవేశపరీక్షలో రాష్ట్రస్థాయి 37వ ర్యాంకు, నానో టెక్నాలజీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. ఇతడు ఒకటి నుంచి పదో తరగతి వరకు తొట్టంబేడు మండలం చియ్యవరం జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు మీడియం చదివాడు. అనంతరం ఇంటర్‌ తిరుపతిలోని భాష్యం కాలేజీ పూర్తి చేశాడు. పుత్తూరు సిద్ధార్థ కాలేజీ బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవి, 91 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆరు నెలల పాటు చైన్నెలో మెకానికల్‌ డిజైనర్‌ వర్క్‌ చేశారు. ఇంతటితో ఈ చదువు ఆగకుండా ఉన్నత విద్య ప్రవేశం కోసం ఏపీపీజీఈసెట్‌ రాసి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.

తాను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదన్న ఆలోచనతో తన కుమార్తె కీర్తనను కష్ట పడి చదివించారు ఎస్‌ఎస్‌పురానికి చెందిన దాసరి సుధాకర్‌ తలిచారు. విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో లైన్‌మన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన తన కూతురి చదువు విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. తన కూతురు చదువులో ప్రతిభ కనబరుస్తుండడంతో, ఆమెను డాక్టర్‌ చేయాలనే ఆశయాన్ని గుండెల్లో పెట్టుకుని చదివించారు.

Advertisement
 
Advertisement
Advertisement