ఎకరానికి రూ. కోటిస్తేనే భూములు ఇస్తాం | - | Sakshi
Sakshi News home page

ఎకరానికి రూ. కోటిస్తేనే భూములు ఇస్తాం

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

సత్యవేడు: ఇరుగుళం, కొల్లడం పంచాయతీల్లో ఏపీఐఐసీకి భూసేకరణకు ప్రభుత్వం రైతులు భూములు తీ సుకునేందుకు ఎకరం భూమికి రూ.కోటి విలువ ప్రకటిస్తేనే పట్టా భూములు ఇస్తామని, లేకుంటే ఇవ్వబో మని రైతులు భీషించారు. శుక్రవారం సత్యవేడు రెవె న్యూ కార్యాలయంలో కొల్లడం, ఇరుగుళం రైతులతో జేసీ గోవిందరావు, ఆర్డీఓ దేవేంద్రరెడ్డి, తహసీల్దారు శివప్రసాద్‌ రైతులతో చర్చలు జరిపారు. జేసీ మాట్లాడుతూ ఏపీఐఐసీకి రైతులు భూములు ఇవ్వాలన్నారు. ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ఎక రం భూమి రూ.23.80 లక్షలు నుంచి రూ. 26 లక్షలు వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామసభలు జరపకుండా, రైతులు సమస్యలు తెలుసుకోకుండా ప్రభు త్వం వరుసగా ఫారం నెం.6(ఏ) నోటిఫికేషన్‌, పారం–7 డిక్లరేషన్‌ ఇవ్వడం అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్టం అనుసరించకుండా ఇంత తొందర గా ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటిపాకం, రాచపాళెంలో భూములను బలవంతంగా తీసుకుని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాల్సి ఎమర్జెన్సీ అవసరం ఏముందన్నా రు. ప్రస్తుతం భూముల రేట్లు మార్కెట్‌ ధర ఎకరం రూ. కోటి నుంచి రూ.2.50 కోట్లు వరకు ఉందన్నారు. సోషల్‌ ఇంఫాక్‌ అసెస్మెంట్‌ జరిపి, రైతుల సమస్యలు తెలుసుకుని భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని జేసి గోవిందరావు, ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement