సూళ్లూరుపేట: యువతను ఇస్రో వైపు ఆకర్షించేలా ని ర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా– 2026) అనే కార్యక్రమాన్ని 11 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇస్రో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం గత ఆ రేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈనెల 11 నుంచి 22వ తేదీ వరకు దేశంలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహమ్మదాబాద్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ స్పేస్ సెంటర్ హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డెహరాడూన్, ఇస్రో ప్రపొల్షన్ రీసెర్చి కాంఫ్లెక్స్ మహేంద్రగిరి, నార్త్ ఈస్టరన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్, రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ జోధ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు. దే శంలోని తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండు వారాలపాటు నిర్వహించే రెసిడెన్సియల్ కార్యక్రమంగా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వివిధ ఇస్రో కేంద్రాల్లో 1,320 మంది విద్యార్థులకు శిక్షణనిచ్చారు. ఈ ఏడాది యువికా–2026 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,06,530 మంది విద్యార్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా ఇందులో 456 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వి ద్యార్థులకు శాసీ్త్రయ థృక్ఫథాన్ని పెంపొందించడం, సీనియర్ శాస్త్రవేత్తలు, గగన్‌యాత్రికులతో సంభాషణలు, ఉపన్యాసాలు, రోహిణి–200 రాకెట్ ప్రయోగా న్ని ప్రత్యక్షంగా వీక్షించడం, చంద్రయాన్–3 డైకిట్ అసెంబ్లీ, మోడల్‌రాకెట్ అసెంబ్లీ అండ్ ప్రయోగం, మరిన్ని హ్యాండ్స్–ఆన్ కార్యకలాపాల వంటి అనుభవ పూర్వక అభ్యాసం, అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, అనువర్తనాలపై అవగాహన కల్పిస్తారు. ఈనెల 11న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో 57 మంది విద్యార్థులు శిక్షణలో ఉన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ల క్ష్యాన్ని సాధించడంలో భారత్ యువ విద్యార్థులు కీలకమైన పాత్ర పోషించనున్నారని ఇస్రో పేర్కొంది.


